సాక్షి,ఆదిలాబాద్: ప్రజాపాలనలో గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రజల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిస్తూ పేదలకు లబ్ధి కలిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో అర్హులకు మేలు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో గురువారం జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్పీలు మౌనిక, సాయి రుత్విక్ కొట్టే, సబ్ కలెక్టర్ ప్రణయ్‌కుమార్‌తో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు.
జిల్లా ప్రగతి ప్రసంగం ఆయన మాటల్లోనే...
రిమ్స్ ఆస్పత్రిలో నూతనంగా రూ.6లక్షల వ్యయంతో సౌండ్‌ప్రూఫ్ గదిని ప్రారంభించాం. ఉట్నూర్, బోథ్ ఆస్పత్రుల నవీకరణకు రూ.41.70కోట్ల నిధులు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయి. విద్యుత్ లోవోల్టేజీ సమస్యలు, సరఫరా అంతరాయం శాశ్వత పరిష్కారానికి రూ.24.70కోట్లతో 9 నూతన సబ్‌స్టేషన్లు, 163 అదనపు డీటీఆర్‌లు ఏర్పాటు చేస్తున్నాం.
మరింత చేయూత..
సీఎం గిరి వికాసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అట్టడుగు వర్గాలకు విద్యుద్ధీకరణ పూర్తి చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో బడుగు, బలహీన వర్గాల సొంతింటి కల సాకారమవుతుంది. నూతనంగా చేయూత పింఛన్ల దరఖాస్తులను ఈ నెల 15వరకు స్వీకరించాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా పంట దిగుబడులను కొనుగోలు చేస్తున్నాం. మహిళ సాధికారతే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా జిల్లాలోని 14,527స్వయం సహాయక సంఘాలను బలోపే తం చేస్తున్నాం. రూ.1552కోట్ల వడ్డీలేని రుణాలు ఇ చ్చాం. రూ.67లక్షల ఆదాయంతో బడి పి ల్లల ఏకరూప దు స్తుల తయారీని సంఘాలకు అందజేశాం. బ్యాంక్ లింకేజీ ద్వారా ఈ ఆ ర్థిక సంవత్సరం 1284 సంఘాలకు రూ.10,178 కోట్ల ఆర్థిక సాయం అందించాం.
వసతిగృహాల నిర్మాణం..
జిల్లాలో రూ.11.10 కోట్లతో 3 కొత్త వసతిగృహాల నిర్మాణాలు, రూ.96 లక్షలతో మరమ్మతు చేశాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ నిరుద్యోగ యువత, చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటున్నాం. ఐటీడీఏ నూతన భవన నిర్మాణానికి రూ.15కోట్ల నిధులు మంజూరు చేశాం. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఉట్నూర్ రాజుల కోటకు రూ.3.90కోట్లు, కుంటాల జలపాతానికి రూ.3.81కోట్లు మంజూరు చేశాం. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వివిధ పనులు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ.307కోట్ల అంచన వ్యయంతో జిల్లాలో 8 హ్యామ్ రహదారుల టెండర్లు పూర్తి చేశాం.
విమానాశ్రయం భూసేకరణ..
ఆదిలాబాద్ అభివృద్ధిలో చారిత్రాత్మకమైన జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (ఎయిర్‌పోర్టు) ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.2278.14 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం 2009.23 ఎకరాల భూమిని సేకరిస్తున్నాం. మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగ అభివృద్ధికి ఎయిర్‌పోర్టు ఉపయుక్తంగా మారనుంది. ఉత్తర తెలంగా ణ అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. ఇండస్ట్రీయల్ పార్క్ కోసం 2062ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టేందుకు ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని రూపొందించి గ్రామ సంఘాలను సమన్వయం చేశాం. ఇందులో భాగంగా జిల్లాలో రూ.88.17కోట్ల అంచన వ్యయంతో 94,600 ఇంకుడు గుంతలు, 1786 పంట కుంటలు, 40 ఊట కుంటలు, 6,270బోరుబావుల రీచార్జ్ నిర్మాణాల కోసం ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం ఆ పనులు వివిధ దశలో పురోగతిలో ఉన్నాయి. వీబీజీ రామ్ ద్వారా జాబ్ కార్డు కలిగిన ఉపాధి కూలీలకు 31.37లక్షల పనిదినాలు కల్పించి రూ.86.65 కోట్లు చెల్లించాం.
ఎల్‌నినోను
ఎదుర్కొనేందుకు..


