కై లాస్‌నగర్: ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఆన్‌మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లకు జిల్లా అధికార యంత్రాంగం నోటీసులను జారీ చేస్తోంది. అయితే ఎవరికి నోటీసులు అందుతున్నాయి, నోటీసులు అందిన ఓటర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించాలనే విషయం తెలియక చాలా మంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నోటీసులు వచ్చిన వేలాది మంది ఓటర్లు అధికారిక విచారణకు హాజరుకావడం లేదు. వచ్చేవారు ఎలాంటి ధృవీకరణపత్రాలు తీసుకురావాలో తెలియక సతమతమవుతున్నారు. దీనిపై ఓటర్లలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలనే ఉద్దేశంతో వారి ప్రయోజనార్దం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఆదిలాబాద్ ఆర్డీవో) పి.జగదీశ్వర్‌రావుతో ‘సాక్షి’ శుక్రవారం ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలోని ఓటర్లు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.


