కై లాస్‌నగర్: అర్హులైన నిరుపేదలకు చేయూత కింద అందజేయనున్న పెన్షన్ల కోసం రాష్ట్ర ప్ర భుత్వం ఇటీవల దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 15,466దరఖాస్తులు అందాయి. ఇందులో అ ర్హులైన వారి గుర్తింపు కోసం ప్రభుత్వం విచా రణకు ఆదేశించింది. ఈ బాధ్యతలను గెజిటెడ్ అధికారులకు అప్పగించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో విచారణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. సంబంధితాధికారులు దరఖాస్తుదారు ల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. దరఖాస్తు చేసిన సమయంలో ఏమైన డాక్యుమెంట్స్ జతచేయని పక్షంలో దరఖాస్తుదారుల నుంచి వాటిని స్వీకరిస్తున్నారు. వాటిని ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.


