నార్నూర్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పించాలని ఐటీడీఏ ఉట్నూరు ప్రా జెక్టు ఉద్యాన అధికారి, జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమల్ల సందీప్‌కుమార్ సూచించారు. నార్నూర్ మండలం మాన్కాపూర్ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, గాదిగూడ మండలం చిత్తగూడ శాటిలైట్ సెంటర్ పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. రికార్డులను పరిశీలించారు. చిత్తగూడ ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడంలేదని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉన్నట్లు తనిఖీలో గుర్తించారు. ఈ అంశాలపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి నివేదిక సమర్పిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీసీసీ సీనియర్ మేనేజర్ సంతోష్‌కుమార్, మాన్కాపూర్ ఆశ్రమ పాఠశాల హెడ్‌మాస్టర్ మెస్రం ధన్ను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


