మాతాశిశువుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మాతాశిశువుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

May 22 2026 4:28 AM | Updated on May 22 2026 4:28 AM

● ఎంపీ గోడం నగేష్‌

ఇచ్చోడ:మాతాశిశువుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ అన్నారు. గురువారం ఇచ్చోడ పీహెచ్‌సీలో బేబీ ఫీడింగ్‌ రూంను ప్రారంభించి మాట్లాడారు.కేంద్రంలో బీజేపీ ప్ర భుత్వం మాతా శిశు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. వైద్యాధికారి మధురిమ, సీహెచ్‌వో బ్రహ్మానందరెడ్డి, హెల్త్‌ అసిస్టెంట్‌ రాథోడ్‌ కై లాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట

నేరడిగొండ: తల్లీ బిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ అన్నారు. నేరడిగొండ పీహెచ్‌సీలో బేడీ ఫీడింగ్‌ సెంటర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లులు తమ చిన్నారులకు ప్రశాంత వాతావరణంలో పాలిచ్చేందుకు ప్రత్యేకంగా సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, మండల అధ్యక్షుడు ఆకుల రాజశేఖర్‌, జిల్లా కార్యదర్శి గాదె శంకర్‌, దక్షిణ మధ్య రైల్వే బోర్డ్‌ మెంబర్‌ గణేష్‌ భోసారె, తదితరులు పాల్గొన్నారు.

మాతా శిశువుల సంక్షేమానికి గొప్ప వేదిక

బోథ్‌: మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్‌ సెంటర్‌ మాతా శిశువుల సంక్షేమానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఎంపీ గోడం నగేష్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ రాజనాల రవీంద్ర ప్రసాద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కదం ప్రశాంత్‌, కేంద్రె శివ, కనపర్తి చంద్రకాంత్‌, జాదవ్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

మహిళల ఆత్మగౌరవం కోసమే..

తలమడుగు: మహిళల ఆత్మగౌరవం కోసమే మదర్‌ ఫీడింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ గోడం నగేష్‌ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కోల్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ‘మదర్‌ ఫీడింగ్‌ రూమ్‌’ను ప్రారంభించారు. సర్పంచ్‌ ఏలుగు చంటి, పాల్గొన్నారు.

మాతాశిశు సంక్షేమానికి కృషి

బజార్‌హత్నూర్‌: జిల్లాలో మాతాశిశు సంక్షేమానికి కృషి చేస్తానని ఎంపీ గోడం నగేష్‌ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో మదర్‌ బేబీ ఫీడింగ్‌ క్యాబిన్‌ను ప్రారంభించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ మేక ల వెంకన్న, మండల అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్‌, శంకర్‌, రమణ, గణేష్‌, చంద్రకాంత్‌ పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌ : మండల కేంద్రంలోని బస్టాండ్‌, పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన మదర్‌ ఫీడింగ్‌ గదులను ఎంపీ నగేష్‌ ప్రారంభించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌ కేంద్రే, మండలాధ్యక్షుడు శివ కేంద్రే, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement