బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్‌

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

జన్నారం: ఇంటర్‌ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసిన ఓ బాలిక వేసవి సెలవులో పిన్ని, బాబాయి ఇంటికి వచ్చింది. జన్నారం మండలం కవ్వాల్‌ గ్రామానికి చెందిన డోంగరి లక్ష్మణ్‌ సదరు బాలికతో సాన్నిహిత్యం ఏర్పర్చుకొని ఆమెతో పొటోలు దిగాడు. ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడుతానని, కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరించి ఆమైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో బాలిక తల్లి గత నెల 28న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపి 29న నిందితుడిని అరెస్ట్‌ చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement