రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు గడుపుతున్నారు కార్మికులు. నిద్ర నుంచి మేల్కొనగానే పనికోసం అన్వేషణ మొదలవుతుంది. పనిదొరికితే ఆ రోజు గడుస్తుంది. లేదంటే పస్తులే. ఎండైనా వానైనా, చలినైనా తట్టుకుని కష్టపడాల్సిందే. తమ కుటుంబాల పోషణ కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి, కష్టమైనా ఇష్టంగా పనులు చేస్తున్నారు. ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా వారి రాత మాత్రం మారడం లేదు. మేడే సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిలో నిమగ్నమైన కార్మికుల బతుకుపోరాట చిత్రాలు ఇవీ. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్
కార్మికుల బతుకు పోరు
May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM
●
Advertisement


