మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

లక్ష్మణచాంద: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు మండలంలోని గంజాల్‌ గ్రామానికి చెందిన మూడారపు ప్రణయ్‌కుమార్‌ (28) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని భార్య వినీత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.

బైకును తప్పించబోయి.. ఎడ్లబండిని తాకి..

వేమనపల్లి: ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు పక్కనే నిలిచి ఉన్న ఎడ్లబండిని తాకడంతో విద్యుత్‌ స్తంభం విరిగి బస్సుపై పడింది. దీంతో గ్రామంలో మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద వారసంత జరుగుతోంది. సుంపుటం నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బస్టాండ్‌ సమీపంలోకి రాగానే డ్రైవర్‌ ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి మరోవైపు నిలిపి ఉన్న ఎడ్లబండిని తాకించాడు. ఎడ్ల బండి విద్యుత్‌ స్తంభానికి తాకడంతో స్తంభం విరిగి ఆర్టీసీ బస్సుపై పడిపోయింది. విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో పెను ప్రమాదం తప్పింది. వార సంత జరిగే ప్రదేశంలోనే ఈ ఘటన జరగడం, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో వ్యాపారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌ శాఖ ఏఈ దీక్షిత్‌, సబ్‌ ఇంజినీర్‌ ఆకాష్‌, నీల్వాయి ఎస్సై జగదీష్‌రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement