బోథ్: నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని గురువారం ఎమ్మె ల్యే అనిల్ జాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. వంద పడకల నూతన ఆస్పత్రి భవన నిర్మాణ పనుల పు రోగతిని ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆస్పత్రి ప్రారంభానికి అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక సదుపాయా ల కల్పనపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఐసీ యూ బెడ్లు, ఇన్ పేషెంట్ పడకలు, వీల్ చైర్లు, ఇత ర ఫర్నిచర్ అవసరాలను గుర్తించి నివేదిక సిద్ధం చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రప్ర సాద్, సర్పంచ్ కె.అన్నపూర్ణ మహేందర్, ఆర్‌ఎంవో, అకౌంట్స్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
బోథ్ మండల కేంద్రానికి చెందిన పుండ్రు గంగా రెడ్డి ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట స్థానిక నాయకులున్నారు.


