భవన నిర్మాణానికి భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణానికి భూమిపూజ

May 1 2026 5:27 AM | Updated on May 1 2026 5:27 AM

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని చించుఘా ట్‌ పంచాయతీ పరిధిలో రాయి సెంటర్‌ గిరి జన భవన్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయి సెంట ర్లు గిరిజన యువతకు సాంకేతిక, నైపుణ్యాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపా రు. రాయి సెంటర్లతో ఉపాధి అవకాశాలు పెంపొందించి గిరిజనుల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి 106 రాయిసెంటర్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంకా 46 రాయి సెంటర్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement