కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా జగదీశ్వర్‌గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం కమి షనర్‌గా పని చేస్తున్న రా జును మంచిర్యాల మున్సి పల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ప్రభుత్వం బ దిలీ చేసింది. ఆయన స్థానంలో నిర్మల్ ము న్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న జగదీశ్వర్‌గౌ డ్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జగదీశ్వర్‌గౌడ్ ఇదివరకు ఆది లాబాద్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా సుదీర్ఘకాలం పాటు పని చేశారు. ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ వాస్తవ్యుడు కావడం గమనార్హం. శుక్రవారం ఆయన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


