కై లాస్‌నగర్: జిల్లాలో ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావే శం నిర్వహించి మాట్లాడారు. నీట్ విద్యార్థుల భవి ష్యత్‌తో కూడుకున్నదని, ఏ చిన్న పొరపాటుకు తా వులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప రీక్షాకేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీ రు, తగినంత వెలుతురు, ఫర్నిచర్ ఉండేలా చూడాలని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, ఏఎన్‌ఎంలతో పాటు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూ చించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప రీక్షాకేంద్రాల వద్ద భద్రత, క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదని, 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. పరీక్ష సమయంలో జి రాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయానికంటే నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించే ప్రసక్తి లేదని తెలి పారు. అడిషనల్ కలెక్టర్లు ఆర్‌ఎస్ చిత్రు, ఎస్.రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్‌రావు పాల్గొన్నారు.
ప్రణాళిక పనులు పక్కాగా పూర్తి చేయాలి
జిల్లాలో చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను పక్కాగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న పనుల పురో గతి, నిధుల వినియోగంపై ఆరా తీశారు. పనుల్లో జాప్యం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ని యోజకవర్గ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సి విల్ పనులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవో, డీఆర్డీవో పాల్గొన్నారు.
రేపు మీ సేవా అర్హత పరీక్ష
జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మీ సేవా కేంద్రాల నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 2న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ఓ ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాత్నాల బస్టాండ్ సమీపంలోగల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 11నుంచి మధ్యాహం 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను https:// adilabad. nic. in నుంచి లేదా తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందవచ్చని తెలిపారు. కంప్యూటర్స్ బేసిక్స్, ఎం.ఎస్ ఆఫీస్‌పై 40 మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు.


