సాక్షి, ఆదిలాబాద్: ఎట్టకేలకు ఎకై ్సజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు కానిస్టేబుళ్లు బదిలీ అ య్యారు. కొద్దిరోజుల క్రితం జిల్లా నుంచి 70మంది వరకు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అలాగే, ఆయా జిల్లాల నుంచి అంతే సంఖ్యలో మన జిల్లాకు కానిస్టేబుళ్లు బదిలీ పై వచ్చారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఎకై ్సజ్ శాఖలో బదిలీలు చోటుచేసుకోవడం గమనార్హం. రాష్ట్ర ఎకై ్స జ్ శాఖలో సుదీర్ఘ కాలంగా కానిస్టేబుళ్లు ఒకేచోట పాతుకుపోయారు. అసలు బదిలీల ప్రక్రియే లేకపోవడంతో అవినీతి, అక్రమాలపై ఆ శాఖలో ఫిర్యాదులు పెరిగిపోయాయి. అంతే కాకుండా కొంత మంది కానిస్టేబుళ్లు లిక్కర్, గంజాయి స్మగ్లర్లతో చేయి కలిపి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ సౌమ్య మృతి తర్వాత ఈ శాఖలో ఇలాంటి అంశాలపై కమిషనర్ హరికిరణ్ నిశితంగా దృష్టి సారించడం, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాఖ లో ప్రక్షాళన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్ల బదిలీలు చోటుచేసుకున్నాయని ఆ శాఖలో చర్చ సాగుతోంది.
ఎనిమిదేళ్లకు పైగా ఒకేచోట..
ఎకై ్సజ్ శాఖలో సుమారు ఎనిమిదేళ్ల నుంచి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు కానిస్టేబుళ్లు ట్రా న్స్‌ఫర్ అయ్యారు. జిల్లా నుంచి పెద్ద మొత్తంలో బాసర జోన్ పరిధిలోని ఆయా జిల్లాలకు బదిలీపై వెళ్లారు. కాగా, శాఖలో ప్రక్షాళన కారణంగా బదిలీ పై ఇతర జిల్లాల నుంచి వచ్చిన కానిస్టేబుళ్లు తిరిగి సొంత జిల్లాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ విషయంలో కమిషనర్ కఠినంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ స్థానాల్లో చేరి నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర జిల్లాల నుంచి ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చిన పలువురు కానిస్టేబుళ్లకు తమ సొంత జిల్లాల్లో రాజకీయంగా పలుకుబడి ఉండడంతో ఇక్కడి అధికారులతో కొంత వైరం కొనసాగుతుందనే ప్రచారం కూడా లేకపోలేదు. మొత్తంగా ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుళ్ల బదిలీ ల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.


