శిక్షణ తరగతులకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ | - | Sakshi
Sakshi News home page

శిక్షణ తరగతులకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

May 1 2026 5:27 AM | Updated on May 1 2026 5:27 AM

కై లాస్‌నగర్‌: ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్లకు కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో సీడీఎంఏ టీకే.శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆదిలాబా ద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష హాజరయ్యారు. మున్సిపాలిటీ పాలనా వ్యవహారాల నిర్వహణ, టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, ఇంజినీరింగ్‌, శానిటేషన్‌ విభాగాల్లో జరుగుతున్న కార్యకలాపాలు వాటిపై పర్యవేక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. చెత్త సేకరణ, మున్సిపాలిటీకి సొంత ఆదాయాన్ని సమకూర్చుకునే ట్రేడ్‌ లైసెన్సులు, వాటర్‌ టాక్స్‌, ప్రాపర్టీ టాక్స్‌, యూజర్స్‌ చార్జీల వసూలు లాంటి వివిధ అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైర్‌పర్సన్‌ బండారి అనూష ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిస్థితిని సమగ్రంగా వివరిస్తూ.. ప్రత్యేక నిధులు కేటాయించేలా చూడాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement