ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మెట్టు ప్రహ్లాద్, దాసరి రమేశ్, కస్తాల ప్రేమల, స్వరూపరాణి, మమత, కరుణ, సలీమ్, ధమ్మపాల్, గణేష్, పరమేశ్వర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.


