వేసవి శిబిరాలొచ్చేసినయ్‌ | - | Sakshi
Sakshi News home page

వేసవి శిబిరాలొచ్చేసినయ్‌

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

● అందుబాటులోకి సృజనాత్మక కేంద్రాలు ● ఆయా శాఖలు, సంస్థల ఆధ్వర్యంలో.. ● చిన్నారుల కోసం ప్రత్యేక శిక్షణ ● క్రీడా, సాంస్కృతిక అంశాల్లో తర్ఫీదు ● ఇప్పటికే పలుచోట్ల ప్రారంభం ● త్వరలోనే మరికొన్ని షురూ

జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో మే 1నుంచి జూన్‌ 7వరకు జిల్లాలోని 21 కేంద్రాల్లో విద్యార్థు ల కోసం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్‌, కుస్తీ, కబడ్డీ, విలువిద్య, నెట్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌, బేస్‌బాల్‌, ఖోఖో, హాకీ, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌ వంటి వివిధ క్రీడాంశాల్లో ప్రత్యేక కోచ్‌లతో శిక్షణ ఇవ్వనున్నారు. అథ్లెటిక్స్‌ శిక్షణను ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని చాందా(టి), భీంపూర్‌ మండలంలోని అర్లి(టి)లో, కుస్తీ శిక్షణను తలమడుగు మండలం సుంకిడి, ఉట్నూరులో నిర్వహిస్తారు. కబడ్డీ మావలలో, విలువిద్య ఆది లాబాద్‌ గ్రామీణ మండలం చించుఘాట్‌, తలమడుగు మండలం బరంపూర్‌లో అందుబాటులో ఉంటుంది. వాలీబాల్‌ శిక్షణను గాదిగూడ, నార్నూరు, ఇంద్రవెల్లి, సాత్నాల మండలంలోని లోకారిలో, ఖోఖో తలమడుగు మండలం కుచులాపూర్‌లో, హాకీ బోథ్‌మండలం మర్లపెల్లిలో అందిస్తారు. సాఫ్ట్‌బాల్‌ శిక్షణ నేరడిగొండ, బజార్‌హత్నూర్‌లో, బేస్‌ బాల్‌ ఇచ్చోడ, ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం తంతోలిలో, నెట్‌బాల్‌ ఇచ్చోడలో, హ్యాండ్‌బాల్‌ శిక్షణ ను ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మివాడ, ఆదిలాబాద్‌ రూరల్‌మండలం అంకోలిలో నిర్వహించనున్నారు. ఆసక్తిగల క్రీడాకారులు https:// sat gasc. telan gana. gov. in/ stadiums వెబ్‌సైట్‌లో పేర్లు నమో దు చేసుకోవాలని డీవైఎస్‌వో శ్రీనివాస్‌ తెలిపారు.

వేసవి సెలవులు వచ్చేశాయి. ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఆటపాటలకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇప్పటికే పలు శిక్షణ శిబిరాలు ప్రారంభం కాగా.. త్వరలోనే మరిన్ని షురూ కానున్నాయి. ఆయా క్యాంపులు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. చిచ్చరపిడుగులకు కొత్త అంశాలు నేర్పడంతో పాటు, భవిష్యత్తులో ఆయా రంగాల్లో రాణించేందుకు ఇవి దోహదపడనున్నాయి. సృజనాత్మకత వెలికితీసే కేంద్రాలుగా నిలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వేసవి శిక్షణ శిబిరాలపై ఓ లుక్కేద్దామా మరి. – ఆదిలాబాద్‌

క్రీడా శిక్షణా శిబిరాలు

బాలకేంద్రంలో..

పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో..

‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా చిన్నారులకు ప్రత్యేక శిక్షణ కా ర్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 2వ తరగతి నుంచి 10 వ తరగతి చదువుతున్న బాలబాలికలు ఈ శిబి రా ల్లో పాల్గొనేందుకు అర్హులని ఇటీవల ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. మే 4నుంచి 30వరకు ఐదు చోట్ల ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ తోపాటు ఇచ్చో డ, ఇంద్రవెల్లి, నార్నూర్‌,బోథ్‌ పోలీస్‌స్టేషన్ల పరి ధిలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయి. కరాటే, యోగా, ఫిజికల్‌ ఎఫిషియన్సీ ట్రైనింగ్‌, కబడ్డీ, వాలీబాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, ఆర్చరీ క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నా రు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 30లోపు సమీ పంలోని పోలీస్‌స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవ చ్చు. వివరాలకు నోడల్‌ ఆఫీసర్‌ వెంకటిని 87126 59961 నంబర్‌లో సంప్రదించవచ్చు.

వేసవి సెలవుల సందర్భంగా పట్టణంలోని బాలకేంద్రం 5 నుంచి 16 ఏళ్ల లోపు బాలబాలికలకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 27న ప్రారంభమయ్యాయి. మే 31 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 4:30 నుంచి 7:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో కూచిపూడి, జానపద నృత్యం, సంగీతం (లలిత, కర్ణాటక), వాయిద్య పరికరాలు (తబలా, హార్మోనియం), చిత్రలేఖనం, కుట్లు–అల్లికలలో నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు చేపడతారు. ఆసక్తి, అర్హులైన చిన్నారులు రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రాలతో కలెక్టరేట్‌ చౌక్‌ సమీపంలోని బాలకేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాలకు బాలకేంద్రం సూపరింటెండెంట్‌ మిట్టు రవిని 9703686368 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement