ఆదిలాబాద్‌టౌన్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించినప్పుడు బాధితుల్లో పోలీసులపై గౌరవం, నమ్మకం పెరుగుతుందన్నారు. అలాగే జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉన్నా నేరుగా 8712659973 నంబర్‌కు వాట్సప్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని కవిత, సిబ్బంది పాల్గొన్నారు.


