ఈ సమితి ఆధ్వర్యంలో ఏటా వివేకానంద బాల సంస్కార్ పేరిట వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది సైతం నైతిక, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాలతో కూడిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈనెల 24న మున్సిపల్ చైర్ పర్సన్ అనూష శిబిరాన్ని ప్రారంభించారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారు ఇందులో చేరేందుకు అర్హులు. యోగా, ధ్యానం, శ్రీమద్భాగవత కథలు, భగవద్గీత శ్లోకాలు, ఏకాగ్రత పెంచే ఆటలు, భజనలు, వేద గణితం, చిత్రలేఖనం, చేతిరాత వంటి అంశాల్లో ఉదయం 7 నుంచి 10.45 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. సంజయ్‌నగర్‌లోని శ్రీరామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో శిబిరం కొనసాగుతుందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూమన్న, లెనిన్ పేర్కొంటున్నారు. వివరాలకు 9490052842, 90328833582 నంబర్లలో సంప్రదించవచ్చని సూచిస్తున్నారు.


