ఆదిలాబాద్‌టౌన్: ఎరువుల కంపెనీలు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొంటూ జిల్లా కేంద్రంలో ఆగ్రో డీలర్లు సోమవారం నిరసన వ్య క్తం చేశారు. పంజాబ్ చౌక్‌లోని రైతు విగ్రహాని కి పూలమాలలు వేశారు. అనంతరం ప్రదర్శన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా గల ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకా ణాలను సోమవారం మూసివేశారు. వీరికి ఆదిలాబాద్ ఆత్మ డివిజన్ చైర్మన్ గిమ్మ సంతోష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి శివప్రసాద్ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌కు ముందు కంపెనీలు డీలర్లపై ఎరువులు, యూరియా కొనుగోళ్లలో ఇతర ఉత్పత్తులను అంటగడుతున్నాయని తెలిపారు. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. బస్తాపై రూ.40 నుంచి రూ.50 వరకు అదనపు భారం పడుతుందని తెలిపారు. ఇందులో అగ్రో డీలర్లు ప్రశాంత్, సందేశ్, శ్రీనివాస్, బాలాజీ, సంతోష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


