ఆదిలాబాద్: వాసవీమాత చూపిన మానవ సేవ, అహింసా మార్గం అనుసరణీయమని క లెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం తన దృష్టికి తెచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో డీవైఎస్‌వో శ్రీనివాస్, పర్యాటక శాఖ అధి కారి రవి కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తవార్ రాజేశ్వర్, భక్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.


