ఆదిలాబాద్: నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్‌బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించాలని బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివా స్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం జిల్లా క్రీడాకారు ల ఎంపిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 27నుంచి నిజామాబాద్‌లో నిర్వహించనున్న పోటీల్లో జిల్లా జట్లు సత్తా చాటాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికై న క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఇందులో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జ్యోతి అజయ్, కోశాధికారి గౌతమ్, హరిచరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


