● స్వీయ నమోదు ప్రక్రియ షురూ ● వివరాలు అందజేసిన ప్రముఖులు ● మే 11 నుంచి ఇంటింటి జనగణన ● ఎస్‌ఈ ఐడీతో ప్రక్రియ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

● స్వీయ నమోదు ప్రక్రియ షురూ ● వివరాలు అందజేసిన ప్రముఖులు ● మే 11 నుంచి ఇంటింటి జనగణన ● ఎస్‌ఈ ఐడీతో ప్రక్రియ వేగవంతం

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

● స్వీయ నమోదు ప్రక్రియ షురూ ● వివరాలు అందజేసిన ప్రముఖులు ● మే 11 నుంచి ఇంటింటి జనగణన ● ఎస్‌ఈ ఐడీతో ప్రక్రియ వేగవంతం

జనగణనకు శ్రీకారం

కై లాస్‌నగర్‌: వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన ప్రక్రియకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. తొలు త స్వీయ గణన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రముఖులు తమ వివరాలు నమో దు చేసుకున్నారు. ప్రతీ కుటుంబం ఈ ప్రక్రియలో బాధ్యతగా పాల్గొని సరైన సమాచారం అందించా లని కలెక్టర్‌ రాజర్షిషా కోరారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్‌ మహజాన్‌, అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్‌ చిత్రు, రాజేశ్వర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.

మే 11నుంచి ఇంటింటి గణన

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న జనగణన. ఈ ప్రక్రియను రెండు విడతల్లో డిజిటల్‌ విధానంలో చేపడుతున్నారు. మొద టి దశలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణనను మే 11 నుంచి జూన్‌ 9 వరకు నిర్వహిస్తారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, గృహ ని ర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, వి ద్యుత్‌, నివాస స్థితి వంటి అంశాలపై సమగ్ర సమాచారం సేకరిస్తారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా గణన చేపడతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వ్యక్తి వివరాలు నమోదు చేస్తారు.

33 ప్రశ్నలతో సమాచారం సేకరణ

తొలుత స్వీయ ఎన్యూమరేషన్‌కు అవకాశం కల్పించారు. ఆదివారం ప్రారంభమైన ఈ ప్రక్రియ మే 10 వరకు కొనసాగనుంది. https://se.censu s.gov.in పోర్టల్‌ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అయి కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా, విద్య, వృత్తి, సామాజిక పరిస్థితులు వంటి మొత్తం 33 ప్రశ్నలతో కూడిన సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు తెలుగు, ఆంగ్ల భాషల్లో సమాచారం నమోదు చేయవచ్చు.

ఎస్‌ఈ ఐడీతో ప్రక్రియ వేగవంతం

స్వీయ నమోదు ప్రక్రియ పూర్తయ్యాక 11 అంకెలతో కూడిన ఎస్‌ఈ ఐడీ వస్తుంది. దానిని విధిగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ఆ ఐడీ నంబర్‌ చూపించాలి. తద్వారా ఇంటింటి గణన వేగంగా పూర్తి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహజన్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, బోథ్‌ ఎమ్మెల్యే జాదవ్‌ అనిల్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బండారి అనూష తమ వివరాలను స్వీయ నమోదు ద్వారా పూర్తి చేశారు.

వివరాలు పూర్తిగా గోప్యం..

జనాభా లెక్కల చట్టం ప్రకారం ప్రజలు అందించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర శాఖలకు లేదా ఇతర అవసరాలకు వినియోగించరని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాలు, అపోహలు లేకుండా సరైన వివరాలు ఇవ్వాలని సూచించారు. ‘మన జనగణన–మన అభివృద్ధి’ నినాదంతో జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలలు, గ్రామ సభలు, పట్టణ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement