చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

ఇంద్రవెల్లి: చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి.. నాణ్యత విద్యను సద్వినియోగం చేసుకోవాలని వడగామ్‌ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విరేందర్‌ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆది వా రం మండలంలోని వడగామ్‌ గ్రామంలో బడిబాట నిర్వహించారు. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పిల్లల వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆత్రం లక్ష్మణ్‌, ఆత్రం సీతా రాం, జాదవ్‌ రాజు, అంగన్‌వాడీ టీచర్‌ ఆత్రం నా గుబాయి, విద్యార్థులు పాల్గొన్నారు.

బడిబాటతో చదువుకు ప్రోత్సాహం

నేరడిగొండ: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐటీడీఏ విభాగం ఆధ్వర్యంలో సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. లఖంపూర్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం మండలంలోని రోడ్‌ లఖంపూర్‌, గోండ్‌ లఖంపూర్‌ గ్రామాల్లో శ్రీబడి బాటశ్రీ నిర్వహించారు. గ్రామ వీధుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సెడ్మకి సుజాత, గంగారాం, ఉప సర్పంచ్‌ రేంగెపూజ సిద్దేశ్వర్‌, ప్రధానోపాధ్యాయులు ఎ.మధుకర్‌, ఉపాధ్యాయులు వి.రాజేశ్వర్‌, టి.గంగాభవాని, ఎ.రాజునాయక్‌ పాల్గొన్నారు.

బోథ్‌: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బోథ్‌ మండలంలోని పట్నాపూర్‌ గ్రామంలో ఆది వారం బడిబాట కార్యక్రమాన్ని ఎంపీడీవో రమేశ్‌ ప్రారంభించారు. బడీడు పిల్లలందరినీ తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, విద్యాభ్యాసం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పి స్తున్న ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పంద్రం సుగుణ శంకర్‌, పర్యవేక్షకులు రాజేశ్వర్‌, ప్రధానోపాధ్యాయులు ఆత్రం శంకర్‌, శే ఖర్‌, ఉపాధ్యాయులు సాయిరెడ్డి, ఇందల్‌ సింగ్‌, మోహన్‌ సింగ్‌, మారుతి, లక్ష్మణ్‌ నాగోరావు, రామచందర్‌, లాఖాన్‌ సింగ్‌, బలిరాం, గోపీచంద్‌, జైతు పాల్గొన్నారు.

సాత్నాల: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన నాణ్య మైన విద్య లభిస్తుందని ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గణేష్‌ అన్నారు. బడిబాట ముగింపు సందర్భంగా సైద్పూర్‌ ఆశ్రమ పాఠశాల ఆధ్వర్యంలో ఆదివారం సలయితండా, పలైతండా గ్రామాల్లో విద్యార్థులతో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యాబోధనపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ ప్రేమ్‌సింగ్‌, శంకర్‌, కరుణాకర్‌, ప్రభు, శిల్ప, తదితరులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలి

నార్నూర్‌: మండలంలోని మాన్కాపూర్‌ గ్రామంలో ఆదివారం బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్‌ తొడసం రేణుక నాగోరావు పా ల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు అవగా హన కల్పించారు. ప్రతీ చిన్నారికి విద్య ఎంతో ముఖ్యమని, పాఠశాలకు హాజరు కావడం ద్వారా వారి భవిష్యత్‌ బలపడుతుందన్నారు. ప్రభుత్వ పా ఠశాలలో అందుతున్న సౌకర్యాలను సద్విని యో గం చేసుకోవాలని, ఉపాధ్యాయులతో సమన్వ యం చేసుకుని పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పె ట్టాలన్నారు. విజయ్‌కుమార్‌ ఎస్సీఈఆర్పీ, ఉపాధ్యాయులు సుభాష్‌ చౌహాన్‌, ప్రకా ష్‌, మనిక్‌, నివేదిక, జేవంత, సరోజ, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement