ఉట్నూర్‌రూరల్: ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు ఆదివారం తన స్వగ్రామమైన ఉ ట్నూర్ మండలం కల్లూరిగూడ గ్రామంలో నిర్వహించిన జనగణన సర్వేలో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి సర్వే అధికారులకు పూర్తి వివరాలు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలు అధికారులకు సహకరించి కచ్చితమైన వివరాలను నమోదు చేయించాలని సూచించారు. అధికారులకు నేరుగా చెప్పడమే కాకుండా, తమ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సదుపాయం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరాలంటే సర్వే ఎంతో కీలకమని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్విని యో గం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ కోట్నాక్ రఘునాథ్‌రావు, సర్వే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


