నార్నూర్: రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తమ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ నార్నూర్ ద్వారా వ్యవసాయ మార్కెట్ ఇన్‌ఫ్రా సబ్ మార్కెట్‌యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. తేమ 14 శాతం లోపు ఉండాలన్నారు. రైతులు తమ పంటను శుభ్రంగా, ఎండబెట్టి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని సూచించారు. అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, జమాబంది పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను వెంట తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఆడే సురేష్, ఉప సర్పంచ్ మహ్మద్ ఖురేషి, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖషీమ్, భిక్షపతి రాథోడ్, సీఈవో ఆడే గణేష్, తదితరులు పాల్గొన్నారు.


