సీపీఎం పోరాట ఫలితమే పాట్నాపూర్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

సీపీఎం పోరాట ఫలితమే పాట్నాపూర్‌ ఏర్పాటు

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

సాత్నాల: సీపీఎం పోరాట ఫలితమే సాహెజ్‌ పాట్నాపూర్‌ గ్రామం ఏర్పాటు చేయడం జరిగిందని సీపీఎం జిల్లా నాయకులు లంక రాఘవులు అన్నారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులకు ఘన స్వాగతం పలికి, పూలమాలతో సన్మానించారు. గిరిజనుల అవసరాలు తెలుసుకొని, పాట్నాపూర్‌ గ్రామ ఏర్పాటుకు కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామానికి తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి, జాదవ్‌ కాలురామ్‌, ఉప సర్పంచ్‌ కడప అయ్యు, ఆత్రం జంగు, ఆత్రం లేతుబాయి, ఆత్రం నాగుబాయ్‌, ఆత్రం రామారావు, స్వామి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement