బజార్‌హత్నూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చే పట్టిన జనగణన కార్యక్రమంలో భాగంగా ఎ న్యూమరేటర్ చందన్ బాబు, తహసీల్దార్ శ్యా ంసుందర్ ఆదివారం మండల కేంద్రంలో జి ల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లేపూల నర్స య్య నివాసంలో అతని కుటుంబవివరాలు నమో దు చేసి స్వీయ జనగణన ప్రారంభించారు.
ఘనంగా బీఆర్‌ఎస్
ఆవిర్భావ దినోత్సవం
ఇచ్చోడ: మండలంలోని ముఖరా(కె) గ్రా మంలో ఆదివారం బీఆర్‌ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండిపై కేసీఆర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, ప్రధాన విధుల గుండా ఊరేగించారు. మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సూభాష్‌లు మాట్లాడారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారని గుర్తుచేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించాలి
ఇంద్రవెల్లి: విద్యుత్ వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాథోడ్ శేషారావ్ అన్నారు. ఆదివారం మండలంలోని హీరపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. విద్యుత్ సరఫరా, బిల్లుల రికవరీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ బిల్లులు చెల్లింపు కోసం టీజీఎన్‌పీడీసీఎల్ డిజిటల్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఇంద్రవెల్లి ఏఈ జాదవ్ రోహిదాస్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా వాసవీ మాత జయంతి వేడుకలు
బోథ్: మండల కేంద్రంలోని ధర్మశాలలో వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను కమిటీ సభ్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజా కార్యక్రమాలను శాస్తోక్త్రంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం, వర్తక వాణిజ్య రంగాల్లో అందరికీ శుభం కలగాలని కోరు తూ మాతాజీని భక్తులు కోరుకున్నారు. కార్యక్రమంలో వాసవీమాత కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
పోడియం అందజేత
జైనథ్: పాఠశాలకు అవసరాల నిమిత్తం పూర్వ విద్యార్థి బోల్లెం రమేశ్ ఆదివారం 6 వేల విలువ గల పోడియాన్ని పాఠశాలకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి అశోక్ మాట్లాడుతూ.. పాఠశాలకు అవసరమైన సమస్యలను తెలుసుకుని గ్రామస్తులు సాయం చేయడం చాలా సంతోషకరమన్నారు. పాఠశాలకు గ్రామస్తులు ఇలా తోడ్పాటు అందించడం వల్ల పాఠశాలను అభివద్ధి చేసుకోగలమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గజానన్, గంగన్న, సామల రాజవర్ధన్, దాసరి రాములు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.


