ఆకర్షిస్తున్న పూల వనం
బోనమెత్తిన తాంసి
తాంసి మండల కేంద్రంలో ఆదివారం గ్రామదేవతలకు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో సామూహిక బోనాలను సమర్పించారు. డప్పుచప్పుళ్లతో ప్రధానవీధుల గుండా ఊరేగింపుగా పోచ్చమ్మ ఆలయానికి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోచమ్మకు ప్రత్యేకంగా వండిన బోనాలను సమర్పించారు. బోనాల పండుగతో గ్రామంలో పండుగా వాతావరణ నెలకొంది. – తాంసి
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు సమీపంలో జలాంతండా చౌక్ వద్ద నిర్మించిన కల్వర్టు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైంది. తరచు ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు స్పందించడం లేదు. కల్వర్టుకు మర్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
– ఇంద్రవెల్లి
భోరజ్ మండలం తర్ణం శివారు వాగులో ప్రకృతి అరుదైన అందాన్ని ఆవిష్కరించింది. వాగు నిండా తామర పూలు విరబూసి చూపారులను ఆకట్టుకుంటున్నాయి. మండు వేసవిలో నిండు పూల తోటలా ఉందని కొందరు మొబైల్ ఫోన్‌లో తామర పూలను బంధిస్తున్నారు.
– సాత్నాల


