● గ్రామసభలో దప్పాపూర్ గ్రామస్తులు తీర్మానం
నార్నూర్: మండలంలోని దుప్పాపూర్ గ్రామం ఆ దర్శ మార్గంలో పయనిస్తోంది. గ్రామంలో మద్యం నిషేధిస్తూ.. గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మా నం చేశారు. ఆదివారం సర్పంచ్ కనక సత్యనారా యణ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో, ఇప్ప టి నుంచి గ్రామంలో మద్యం, సారా విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ తీర్మానం చేశారు. గ్రామస్తుల సంక్షేమం, యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకు ని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తీర్మానాన్ని ధిక్కరించి ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తూ.. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మద్యరహిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో దూత్రాజు విశ్వజిత్ (ఉప సర్పంచ్), కనక ప్రభాకర్ (గ్రామ పటేల్), శ్రీరంగ వాగమారె, జ్ఞానోబా తిబొటే, రమేశ్, రామకిషన్, దుత్రాజ్ మధుకర్ ధుతరాజ్, శంకర్ కామ్లె, డి. ప్రేమానంద్, బుద్ధాజి, డిగాంబర్, ఉత్తం, త్రీముక్, రవిరాజ్ పాల్గొన్నారు.


