బోథ్: మండలంలోని బిర్లాగొంది సర్పంచ్ రాథోడ్ రాజేశ్వర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పంచాయతీ పరిధిలో జరిగే ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 10,116 ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఆడపిల్లల పెళ్లిల్లకు నగదును అందజేస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన రాథోడ నందు కుమార్తె ఉమా (విజయలక్ష్మి) వివాహానికి నగదు సాయం అందజేశారు. కార్యక్రమంలో రవీందర్, పవన్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పంట కొనుగోళ్లు
నిలిపివేత
బోథ్: బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జొన్న, మొక్కజొన్న. శనగల కొనుగోలు కేంద్రాల్లో పంట నిల్వలు పేరుకుపోవడం వల్ల కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్‌చార్జి బారె నాగబూషణం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు ప్రక్రియకు అంతరాయం కలుగుతుందని, రైతులు గమనించి సహకరించాలని కోరారు.


