ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌కు సన్మానం

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

బోథ్‌: అమెరికన్‌ యూనివర్సిటీ నుంచి ప్రతిష్ఠాత్మక గౌరవ డాక్టరేట్‌ అందుకున్న బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ను సొనాల మండల నాయకులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. విద్య , సామాజిక సేవా రంగాల్లో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా డాక్టరేట్‌ లభించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న అనిల్‌ జాదవ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం బోథ్‌ నియోజకవర్గానికే గర్వకారణమని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేరడిగొండ: బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ డాక్టరేట్‌ పట్టా పొందిన సందర్భంగా మండలంలోని వడూ ర్‌ గ్రామంలో సంబురాలు జరుపుకున్నారు. సర్పంచ్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీ రాభిషేకం చేశారు. సర్పంచ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ నాయకత్వంలో బోథ్‌ ప్రాంతం మ రింత అభివృద్ధి చెందుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు భూ షన్‌, ఫయాజ్‌, సుజిల్‌, రాములు, నవీన్‌, అస్మత్‌, రమణ, స్వామి, ఊషన్న, భూమన్న పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement