జైనథ్ : బుద్ధుడు చూపిన మార్గంలో నడవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని లక్షి్మ్పూర్ గ్రామంలో ఆదివారం నూతనంగా నిర్మించిన బుద్ధ విహార్, భగవాన్ గౌతమ బుద్ధ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం బుద్ధుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి శాంతి, అహింస, సమానత్వం అనే సందేశాలను అందించడం జరిగిందన్నారు. బుద్ధుడు బోధించిన బోధనలు సమాజానికి మార్గదర్శకంగా ఉంటాయన్నారు. గ్రామంలో బుద్ధ విహార్ నిర్మాణం పూర్తిచేసుకుని విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బౌద్ధ సమాజ్ అధ్యక్షుడు భీమ్ రావు, ఉపాధ్యక్షుడు ఆనందరావు, కోశాధికారి భగత్ అశోక్, సంఘం పెద్దలు భగత్ గౌతమ్, దుర్గే ఆజానంద్, నాందేవ్, గ్రామస్తులు అడప తిరుపతి, దాసరి రాములు, గజంగుల స్వామి, నర్సింగ్ రావు, ఇజ్జగిరి నారాయణ పాల్గొన్నారు


