జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు | - | Sakshi
Sakshi News home page

జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు

Apr 26 2026 2:57 AM | Updated on Apr 26 2026 2:57 AM

ఉట్నూర్‌రూరల్‌: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభించామని జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ గుడిమళ్ల సందీప్‌ కుమార్‌ అన్నారు. ఉట్నూర్‌ డివిజనల్‌ కార్యాలయంలో మేనేజర్లు, సిబ్బందితో శనివారం సమావేశమై మాట్లాడారు. గిరిజనులు, ఆదివాసీలు సేకరించిన ఇప్ప పువ్వు, ఇప్ప పరక, తేనె, మైనం, చింతపండును జీసీసీ సొసైటీ కార్యాలయాలు, డిఆర్‌ డిపోల వద్దకు తీసుకువచ్చి విక్రయించాలన్నారు. గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంతోష్‌, ఐటీడీఏ పీవో యువరాజు మర్మాట్‌ ఆదేశాల మేరకు అటవీ ఉత్పత్తుల కొనుగోలు వెంటనే ప్రారంభించామన్నారు. సీనియర్‌ మేనేజర్లు సంతోష్‌ కుమార్‌, తారాచంద్‌, మేనేజర్లు ఇస్తారి, రమేశ్‌, మనోహర్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement