రసవత్తరం | - | Sakshi
Sakshi News home page

రసవత్తరం

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

● కోఆప్షన్‌ పదవులకు పోటాపోటీ ● నాలుగింటికి 28 దరఖాస్తులు ● మూడు రోజుల పాటు పరిశీలన ● ప్రత్యేక సమావేశంలో సభ్యుల ఎన్నిక

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌లో కోఆప్షన్‌ పదవులకు తీవ్రపోటీ నెలకొంది. నాలుగింటికి గా ను 28దరఖాస్తులు అందాయి. ప్రధాన పార్టీలైన బీ జేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ నుంచి భారీగా రాగా ఎంపిక ప్రక్రియ రసవత్తరంగా మారనుంది.

పోటా పోటీ..

నాలుగు కోఆప్షన్‌ పదవుల్లో రెండు జనరల్‌, రెండు మైనార్టీలకు కేటాయించారు. చైర్‌పర్సన్‌ ఎన్నిక స మయంలో కూటమిగా ఏర్పడి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల్లో విబేధాలు తలెత్తినట్లుగా తెలు స్తోంది. అందుకే కోఆప్షన్‌ కేటాయింపుపై ఆయా పార్టీల్లో ఇప్పటి వరకు సఖ్యత కుదరలేదు. ఈ క్ర మంలో బీఆర్‌ఎస్‌ మొత్తం నాలుగింటికి తమ పార్టీ వారితో దరఖాస్తు చేయించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ నుంచి పదవీని ఆశిస్తూ ఏకంగా తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంఐఎం నుంచి ఇద్దరు దరఖాస్తులు అందజేసినట్లుగా తెలి సింది. ఇలా ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందిన నేపథ్యంలో పదవీ ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

పక్కా వ్యూహంతో బీజేపీ ..

చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ఎన్నిక సమయంలో కూటమి తీరుతో భంగపడ్డ బీజేపీ ఈసారి పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తుంది.ఆ పార్టీ తరపున నలుగురిని మాత్రమే బరిలో నిలిపింది. ఎమ్మెల్యే తనయుడు పాయల్‌ శరత్‌ స్వయంగా అభ్యర్థులను మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకువచ్చి దరఖాస్తు చేయించ డం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. కూట మిలో అనైక్యతను సద్వినియోగం చేసుకోవాలని క మలం పార్టీభావిస్తోంది. ఆదిశగా వ్యూహాలకు పదు ను పెడుతూ సభ్యులగెలుపునకు అవసరమైన మద్ద తు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

చైర్‌పర్సన్‌ అనుమతితో ..

దరఖాస్తు గడువు ముగియడంతో మూడు రోజుల పాటు మున్సిపల్‌ అధికారులు వాటి పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం అర్హుల జాబితా సిద్ధం చేసి చైర్‌పర్సన్‌ అనూష ముందు ఉంచనున్నారు. ఆమె అనుమతితో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. చేతులెత్తే విధానంలో ఈ ఎన్నిక చేపట్టనున్నారు. మే మొదటి వారంలో ప్రత్యేక సమావేశం ఉండే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement