ఇంటర్‌ ఫలితాల్లో పురోగతి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో పురోగతి సాధించాలి

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: ఇంటర్‌ ఫలితాల్లో పురోగతి సాధించాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీ క్షల నిర్వహణ, ఈ ఏడాది పరీక్షల ఫలితాలు, ఇతర అంశాలపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇటీవల ప్రకటించిన పరీక్ష ఫలితాలు జిల్లాకు సంబంధించి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రానున్న విద్యాసంవత్సరంలో ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల ఉండాలని ఆదేశించారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజర య్యే విద్యార్థుల కోసం సబ్జెక్టుల వారీగా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో డీఐఈ వో గణేశ్‌ జాదవ్‌, సెక్టోరియల్‌ అధికారి ప్రత్యూష, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు తది తరులు పాల్గొన్నారు.

శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా బాల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రచార పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. కూచిపూడి, జానపద నృత్యం, చి త్రలేఖనం, సంగీతం (లలిత, కర్ణాటక, హిందూస్తా నీ), వాయిద్య పరికరాలు (తబల, హార్మోనియం, పియానో), కుట్లు–అల్లికలు, మెహందీ వంటి అంశాలపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 30 వరకు ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 7:30 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐదు నుంచి 16ఏళ్ల లోపు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతేడాది కరాటేలో అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన మాస్టర్లు మిట్టు దత్తు, గాజుల జగన్నాథ్‌ రుషి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించగా వారికి మెమొంటో అందజేసి అభినందించారు. ఇందులో డీఐఈవో గణేశ్‌ జాదవ్‌, బాల కేంద్రం ప్రతినిధులు మెట్టు రవి, ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement