నేరడిగొండ: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు శనివా రం యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ లీడర్‌షిప్ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, గ్రామీణ ప్రాంతాల్లో చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేసినట్లు వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజ రై డాక్టరేట్‌ను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం తనకు ఆనందంగా ఉంటుందని తెలిపారు. ఆ సేవలే ఈ గౌరవాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు.


