కై లాస్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తలపె ట్టిన జనగణన–2027 ప్ర క్రియ ఆదివారం నుంచి షురూ కా నుంది. తొలివిడతలో భాగంగా ఈ నెల 26నుంచి మే 10 వరకు స్వీయ గణనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రజలు ఇంటి నుంచే ప్రత్యేక యాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. http://se.census.gov.in లింక్‌ను ఓపెన్ చేసి వివరాలను తొమ్మిది స్టెప్‌లలో నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ వినియోగించాలని, అలాగే సరైన వివరాలు నమోదు చేయాలని సూచించారు. మే 11 తర్వాత ఎన్యూమరేటర్లు ఇళ్లవద్దకు వస్తారని, వారికి ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ఎస్‌ఈ ఐడీ చూపిస్తే దానిని పరిశీలించి ఆమోదిస్తారని పేర్కొన్నారు.


