ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి

Apr 25 2026 7:36 AM | Updated on Apr 25 2026 7:36 AM

నేరడిగొండ: ఉపాధిహామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీవో రవీందర్‌ అన్నా రు. వడూర్‌, నేరడిగొండ పంచాయతీల్లో కొనసాగుతున్న ఉపాధి పనులను శుక్రవారం పరి శీలించారు. కూలీల హాజరు నమోదుపై అధికా రులకు పలు సూచనలు చేశారు. ప్రతి జీపీలో కనీసం 150 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో శేఖర్‌, ఏపీవో వసంతరావు, వడూర్‌ సర్పంచ్‌ శ్రీకాంత్‌, కార్యదర్శి సద్దాం హుస్సేన్‌ తదితరులున్నారు.

పలుచోట్ల పనుల పరిశీలన

బోథ్‌: మండల కేంద్రంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డీవో రవీందర్‌ పరిశీలించారు. కూలీలతో మాట్లాడి హాజరు విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం జీడిపల్లిలో ఉపాధి పనులను పరిశీలించారు.ఇందులో పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఈసీ మధుకర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మెట్లు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement