వంద రోజులపై ఆశలు | - | Sakshi
Sakshi News home page

వంద రోజులపై ఆశలు

Apr 25 2026 7:36 AM | Updated on Apr 25 2026 7:36 AM

కేబినెట్‌ నిర్ణయంపై రిటైర్డు ఉద్యోగుల్లో హర్షం జిల్లా బకాయిలు రూ.2,563 కోట్లకు పైనే.. విరమణ బెనిఫిట్స్‌పై తప్పని ఎదురుచూపు త్వరితగతిన చెల్లించేలా చూడాలని విన్నపం

కై లాస్‌నగర్‌: ఉద్యోగ విరమణ పొంది ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలు అందడం లేదు. వాటిని చెల్లించాలంటూ రిటైర్డ్‌ ఉద్యోగులు కొంత కాలంగా ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. బకాయిలను వంద రోజుల్లో చెల్లించాలని నిర్ణయించిన సర్కారు ఇందుకు గాను ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. నిర్దిష్ట కాల పరిమితి ప్రకటించడంపై రిటైర్డ్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రయోజనాలు అందించాలని కోరుతున్నారు.

2024 నుంచి పెండింగ్‌లో..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సును కేసీఆర్‌ సర్కారు మూడేళ్ల పాటు పెంచిన విషయం తెలిసిందే. 2021 మార్చి 31న రిటైర్డ్‌ అయ్యే వారి సర్వీసును మూడేళ్లు పొడిగించింది. అప్పటికే ఉన్న బకాయిలను చెల్లించలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2024 ఏప్రిల్‌ 30 నుంచి ఉద్యోగ విరమణ ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జిల్లాలో వందలాది మంది ఉద్యోగులు ఏటా రిటైర్‌ అవుతున్నారు. వారికి అర్జిత సెలవులు, జీపీఎఫ్‌, గ్రాట్యూటీ, కంటేషన్‌ వంటి ప్రయోజనాలను ఉద్యోగ విరమణ పొందిన వెంటనే చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. ఉద్యోగులకు చట్టపరంగా రావాల్సిన ప్రయోజనాలతో పాటు వారు దాచుకున్న సొమ్మును కూడా పొందలేని పరిస్థితి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. చాలా మంది రిటైర్డ్‌ ఉద్యోగులు ఈ ప్రయోజనాలను పొందకుండానే పరలోకానికి పయనమయ్యారు.

ఎట్టకేలకు స్పందన..

జిల్లాలో ఫ్యామిలీ పెన్షనర్స్‌, సర్వీస్‌ పెన్షనర్స్‌ కలిపి 4,273 మంది ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి సగటు న రూ.60లక్షల నుంచి రూ.70లక్షల వరకు రా వాల్సి ఉంది. మూడేళ్లుగా ప్రభుత్వం వీటి చెల్లింపులో జాప్యం చేస్తోంది. సుమారు రూ.2,563 కోట్ల 80లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రయోజనాలను వెంటనే చెల్లించాలంటూ రిటైర్‌ అయిన వారు దశల వారీగా ఆందోళనలు చేస్తున్నారు. పిల్లల చదువు, ఆ రోగ్యం, పెళ్లిళ్లు, ఇతరత్రా అవసరాల నిమిత్తం దా చుకున్న జీపీఎఫ్‌ సొమ్ము సైతం విడుదల కావడం లేదు. దీంతో చాలా మంది రిటైర్డ్‌ ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. కొంత మంది ఈ వేదన భరించలేక ప్రయోజనాలు పొందకుండానే మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వాటిపై స్పందించింది. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. వంద రోజుల్లో బకాయిల సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. సర్కారు నిర్ణయంపై జిల్లాలోని రిటైర్డ్‌ ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

జిల్లాలో..

సర్వీస్‌ పెన్షనర్స్‌ 2,345

ఫ్యామిలీ పెన్షనర్స్‌1,928

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావా ల్సిన ప్రయోజనాలు మూడేళ్లుగా అందడం లేదు. దీంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి వంద రోజుల్లో చెల్లించేలా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడాన్ని స్వాగతిస్తున్నాం. బకాయిలన్నీ గడువులోపు విడుదల చేయాలి.

– సాయిరి శశికాంత్‌, ఆల్‌ పెన్షనర్స్‌

రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement