ఉట్నూర్‌రూరల్: ఆదివాసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ఉట్నూరు మండలం దొంగచింత, కుమ్మరికుంట గ్రామాల ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్’ రెండో విడత కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఆదివాసీ విజ్ఞాన యాత్ర పేరిట మూడు విడతలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో భాగంగా 450 మందిని 11 టూరిస్ట్ బస్సుల్లో యాత్రకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని విమానాశ్రయం, గోల్కొండ తదితర నగర అందాలను వివిధ పర్యాటక ప్రదేశాలను చూపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఆదివాసీలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక వైటీసీలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు, ఐటీడీఏ పీవో యువరాజ్‌తో కలిసి కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


