ఆదిలాబాద్: చిన్నారుల్లో సంస్కారం పెంపొందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష అ న్నారు. స్థానిక సంజయ్‌నగర్‌లోని శ్రీరామకృష్ణ సేవాసమితి కార్యాలయంలో సమితి ఆధ్వర్యంలో బాలసంస్కార్ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె శిబిరాన్ని ప్రారంభించి మట్లాడారు. వేస వి సెలవుల్లో విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. అనంతరం సేవా సమితి సభ్యులు చైర్ పర్సన్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు భూమన్న, ప్రధాన కార్యదర్శి లెనిన్, సభ్యులు లస్మయ్య, కోటేశ్వరరావు, హన్మండ్లు, శ్రీధర్, ఉపాధ్యాయులు పూర్ణచందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


