ప్రమాదాలు సంఖ్య
ఆదిలాబాద్‌టౌన్: రోడ్డు భద్రతపై పోలీస్‌శాఖ ఫోకస్ పెట్టింది. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్పీ అఖిల్ మ హాజన్ జిల్లాలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అరైవ్–అలైవ్‌లో భాగంగా జనవరి నుంచి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ని ర్వహించారు. 500 రోడ్డు సేఫ్టీక్లబ్‌లు ఏర్పాటు చేసి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. ప్రథమ చికిత్స కిట్లు అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో వీరు క్షతగాత్రుల కు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలిస్తారు. దీంతో ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు 20శాతం తగ్గుముఖం పట్టగా, ఇటీవల జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్‌రెడ్డి జిల్లా పోలీసులను అభినందించారు.
బ్లాక్‌స్పాట్‌లపై దృష్టి
జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతా లను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించారు. నేరడిగొండ నుంచి పెన్‌గంగా వరకు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తరచూ ప్రమాదాలు జరిగే చోట స్పీడ్ బ్రేకర్లు, రంబుల్‌స్టిక్స్, పోలీస్ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన ప్రమాదాలకు గురై న కారును ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. గుడిహత్నూర్ నుంచి సీతాగోంది వరకు డౌనల్‌గా ఉండడంతో వాహనదారులు న్యూ ట్రల్‌లో వెళ్లడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సీతాగోంది, మేకలగండి, వాఘాపూర్ ఎక్స్‌రోడ్ ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరి గి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వే గాన్ని నియంత్రించేందుకు గుడిహత్నూర్ డౌనల్ నుంచి సీతాగోంది వరకు రంబుల్‌స్టిక్స్, స్పీడ్ బ్రేక ర్లు ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి అప్రోచ్ రోడ్డు నిర్మించేలా చర్యలు చేపట్టా రు. కుప్టి, గుడిహత్నూర్ శర్మ దాబా వద్ద రోడ్డు ప్ర మాదంలో నుజ్జునుజ్జయిన కారును ప్రదర్శనకు పె ట్టారు. మేకలగండి వద్ద ట్రాఫిక్ పోలీస్‌కు సంబంధించి వాహన కటౌట్ ఏర్పాటు చేశారు. దీంతో రా త్రివేళ పోలీసులున్నారని వాహనదారులు వేగాన్ని నియంత్రిస్తున్నారు. మేకలగండి నుంచి సీతాగోంది ప్రాంతంలో రాత్రి ప్రమాదాలు జరగకుండా ఎన్‌హె చ్ అధికారులతో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేశారు.
గ్రామాల్లోనూ అవగాహన సదస్సులు
విద్యార్థి దశ నుంచే రోడ్డు నియమాలు తెలిసేలా జి ల్లా కేంద్రంలో ట్రాఫిక్ పార్కు ఏర్పాటు చేశారు. రో డ్డు నిబంధనలు పుస్తకాల్లో కాకుండా నేరుగా అధికా రులు విద్యార్థులకు తెలియజేస్తున్నారు. జిల్లాలోని 38 గ్రామపంచాయతీల్లో సర్పంచుల ద్వారా రోడ్డు నిబంధనలు పాటించేలా తీర్మానాలు తీసుకున్నా రు. డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చే సేవారికి జరిమానా విధించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలు, ముఖ్య కూడళ్లలో ఉదయం, రాత్రి నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల పలువురికి జైలు శిక్ష విధించిన విషయం విధితమే. దీంతో కొంత మందిలోనైనా మార్పు వస్తుందని పోలీసులు భా విస్తున్నారు. మండలానికో కానిస్టేబుల్‌తో ఖాకీ కి డ్స్ ఏర్పాటు చేసి మూడ్రోజుల పాటు పాఠశాలలు, మరో మూడ్రోజుల పాటు గ్రామాల్లో అవగాహన స దస్సులు నిర్వహిస్తున్నారు. మారుమూల గ్రామాల యువతకు డ్రైవింగ్ మేళా ద్వారా లైసెన్స్‌లు జారీ చే స్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్యశిబిరా లు, ‘మైట్యాక్సీ సేఫ్’ అనే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మైనర్లు వాహనాలు నడిపించకుండా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
సంవత్సరాల వారీగా రోడ్డు ప్రమాద వివరాలు
సంవత్సరం రోడ్డు మృతుల
2021 245 145
2022 234 137
2023 286 126
2024 349 127
2025 381 117


