గణిత సబ్జెక్ట్‌పై భయం వీడాలి | - | Sakshi
Sakshi News home page

గణిత సబ్జెక్ట్‌పై భయం వీడాలి

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● కలెక్టరేట్‌ అధికారులతో సమావేశం ● పొన్నారిలో ‘ఉపాధి’ పనుల పరిశీలన

● కలెక్టర్‌ రాజర్షి షా ● కలెక్టరేట్‌ అధికారులతో సమావేశం ● పొన్నారిలో ‘ఉపాధి’ పనుల పరిశీలన

కైలాస్‌నగర్‌: విద్యార్థులు భయం వీడి గణితంపై పట్టుసాధించేలా ప్రత్యేక దృష్టి సారించాల ని కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కా ర్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా విమర్శనాత్మక ఆలోచన, తార్కిక విశ్లేషణ లాంటి నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. 1988నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘ఫ స్ట్‌ ఇన్‌ మ్యాథ్‌’ ద్వారా గణితాన్ని సులభంగా, ఆసక్తికరంగా నేర్చుకునే అవకాశం ఉందని పే ర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రా జేశ్వర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.

పథకాలు పక్కా అమలు చేయాలి

దివ్యాంగుల సంక్షేమ పథకాలను పక్కాగా అ మలు చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ స మావేశం నిర్వహించి మాట్లాడారు. 4శాతం రిజ ర్వేషన్లను అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో కచ్చి తంగా అమలు చేయాలని, పింఛన్లు, యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని, అర్హులకు స్వయం ఉపాధి పథకాల కింద రుణాలివ్వాలని, దుకాణాల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంత్యోదయ కార్డుల జారీ, బస్సు, రైలు ప్రయాణ రా యితీలు, ఉపాధి పనుల్లో సౌకర్యాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ము న్సిపల్‌ కమిషనర్‌ రాజు, జిల్లా ఎస్సీ సంక్షేమాభివృద్ధి అధికారి సునీత, ఈడీ మనోహర్‌, డీ ఎండబ్ల్యూవో కలీం, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రా థోడ్‌, డీసీఎస్వో నందిని, మెప్మా డీఎంసీ శ్రీని వాస్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

కూలీల సంఖ్య పెంచాలి

తాంసి: ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య

మరింత పెంచాలని కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. మండలంలోని పొన్నారి గ్రామంలో చేపట్టిన పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాస్టర్‌ రోల్స్‌ను తనిఖీ చేసి, హాజరైన కూలీల సంఖ్యను సరిచూశారు. అనంతరం కూలీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పని ప్రదేశంలో కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యం క ల్పించాలని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కలె క్టర్‌ వెంట సర్పంచ్‌ భూమన్న, ఉపసర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో రవీందర్‌, ఏపీడీ కుటుంబరావు, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, తహసీల్దార్‌ లక్ష్మి, ఏపీవో విజయ, ఈసీ, టెక్నికల్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement