బడికి టాటా.. | - | Sakshi
Sakshi News home page

బడికి టాటా..

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

● నేటి నుంచి వేసవి సెలవులు ● జూన్‌ 12న పునఃప్రారంభం ● చివరిరోజు ప్రోగ్రెస్‌ కార్డుల పంపిణీ

ఆదిలాబాద్‌టౌన్‌: ఇన్నిరోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు బడికి బై..బై.. చెప్పారు. పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. గురువారం ఈ వి ద్యాసంవత్సరం చివరిరోజు కావడంతో ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి సమక్షంలోనే వార్షిక పరీక్షల ప్రోగ్రెస్‌ కా ర్డులను విద్యార్థులకు అందజేశారు. వేసవి సెలవుల్లో పిల్లలను బయట తిరగనివ్వకుండా చూడాలని, చెరువులు, వాగులకు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వేసవి సెలవులు నేటి నుంచి జూన్‌ 11వరకు ప్రకటించడంతో విద్యార్థులు 49రోజుల పాటు ఇళ్లకే పరిమితం కానున్నారు.

ఇక ఆటాపాట

పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు చదువులకు టాటా చెప్పారు. ఇక ఆటాపాటలతోనే సెలవులు ఎంజాయ్‌ చేయనున్నారు. జిల్లాలోని ఆయా గురుకులాలు, వసతిగృహాల నుంచి విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. విద్యార్థుల తల్లి దండ్రులు, బంధువులు పాఠశాలలకు వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. వేసవి సెలవుల్లో కొందరు విద్యార్థులు సరదాగా ఇంటి వద్దే గడపనుండగా, ఇంకొందరు అమ్మమ్మలు, బంధువుల ఇళ్లల్లో సెలవులు ఎంజాయ్‌ చేసేందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

వివిధ కోర్సుల వైపు..

కొందరు తల్లిదండ్రులైతే తమ పిల్లలకు సెలవుల్లో ఏదైన కోర్సు నేర్పించాలని భావిస్తున్నారు. కంప్యూటర్‌ శిక్షణ, స్విమ్మింగ్‌, క్రికెట్‌, డ్యాన్స్‌, కూచిపూడి నాట్యం తదితర కోర్సుల్లో శిక్షణ ఇప్పించేందుకు సి ద్ధమవుతున్నారు. వేసవి సెలవుల్లో కొందరు ట్యూ షన్లు చెబుతూ వచ్చే విద్యాసంవత్సరం సిలబస్‌ ఇ ప్పటినుంచే బోధించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను ట్యూషన్‌కు పంపించేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement