ఆదిలాబాద్‌టౌన్: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ జి ల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయ వ్య వస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలపర్చిందని చెప్పారు. కమిషన్ నిబంధనలు పాటించలేదని కో ర్టు పేర్కొనడం ద్వారా నిజం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్ర తో బీఆర్‌ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చే స్తోందని విమర్శించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా దవ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను బద్నాం చేయడానికే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారి వెంట పట్టణాధ్యక్షుడు అజయ్, నాయకులు వెనగంటి ప్రకాశ్, కేమ శ్రీకాంత్, మొట్టే కిరణ్, చందల రాజన్న, దాసరి రమేశ్, కొండ గణేశ్, ధమ్మపాల్, సలీమ్, దివిటి రాజు, మహేశ్ కలీమ్ తదితరులున్నారు.


