ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయ తీ పరిధి సాలేగూడ గ్రామస్తులు నీటి కోసం కోటి కష్టాలు పడుతున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచింది. ఇతర నీటి పథకాలు నిరుపయోగమయ్యాయి. సర్పంచ్ కోవ రాజేశ్వర్ ట్యాంకర్ ద్వారా ఇంటింటా తాగునీరు సరఫరా చేస్తున్నారు. కానీ, ఇతర అవసరాలకు నీరు లేక పనులు పక్కనపెట్టి ఆదివాసీలు పొద్దంతా భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ బావులు, బోర్ల నుంచి ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాలపై నీటిని తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పుడే ఇట్లుంటే మే, జూన్ మాసాలను తలచుకుని గ్రామస్తులు
ఆందోళనకు గురవుతున్నారు. – ఇంద్రవెల్లి


