అతి వేగం కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతుండగా బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. జిల్లాలో నిర్వహించిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించాం. నేరడిగొండ నుంచి పెన్‌గంగా వరకు బ్లాక్‌స్పాట్లు గుర్తించి రోడ్డు భద్రత చర్యలు చేపట్టాం. దీంతో 20శాతం వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. అందరి సహకారంతో రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలిచ్చి ప్రమాదాలకు కారకులు కావొద్దు. – అఖిల్ మహాజన్, ఎస్పీ


