మౌనికకు అదనపు ఎస్పీగా ప్రమోషన్‌ | - | Sakshi
Sakshi News home page

మౌనికకు అదనపు ఎస్పీగా ప్రమోషన్‌

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో అడ్మిన్‌ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పి.మౌనిక అదనపు ఎస్పీగా ప్రమోషన్‌ పొందారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆమెను అభినందించారు. ఆమె భుజంపై అదనపు ఎస్పీ హోదా చిహ్నాలు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. మౌనిక ప్రమోషన్‌ పొందినప్పటికీ ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న అడ్మిన్‌ అదనపు ఎస్పీ హోదాలోనే కొనసాగుతారని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) సురేందర్‌రావు, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీసీ కొండరాజు, పలువురు ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement