గ్రామీణాభివృద్ధిశాఖ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా రాజు | - | Sakshi
Sakshi News home page

గ్రామీణాభివృద్ధిశాఖ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా రాజు

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

కై లాస్‌నగర్‌: తెలంగాణ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌గా జిల్లా కేంద్రానికి చెందిన పి.రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎన్జీవో భవన్‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ గెజిటెడ్‌ అధికా రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జేఏసీ ప్రతినిధులు గ్రామీణాభివృద్ధి శాఖ క మిషనర్‌ దివ్య దేవరాజ న్‌ను ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకలగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వి నతిపత్రం అందజేసి పరి ష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు లింగంపల్లి నర్సయ్య, శ్రీనివాసరావు, జిలీల్‌ ఖాన్‌, ప్రతినిధులు పార్థసారథి, నాగయ్య, నారాయణ, ఫిరోజ్‌ఖాన్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement