మొక్కలను సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కలను సంరక్షించాలి

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

ఉట్నూర్‌రూరల్‌: ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీల్లో అవకాడో మొక్కలను సంరక్షించాల ని పీవో యువరాజ్‌ మర్మాట్‌ సూచించారు. బు ధవారం ఉట్నూర్‌ పరిధిలోని ఉద్యాన నర్సరీని సందర్శించారు. వివిధ మొక్కల వివరాలు, సంరక్షణ చర్యలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన నర్సరీల్లో అవకాడో పంటపై రైతులకు అవగాహన కల్పించి, సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. వేసవిలో మొక్కలకు తప్పనిసరిగా నీరు పట్టాలని తెలిపారు. 50 ఎకరాల ఉద్యాన నర్సరీని సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోనున్న ట్లు పేర్కొన్నారు. మొక్కల సంరక్షణలో భాగంగా నీటి వనరుల వివరాలను ఉద్యాన అధికారి సందీప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement